![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -187 లో..... రామరాజుకి తెలియకుండా ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్తుందని తనకి నర్మద సపోర్ట్ చేస్తుందని ఇద్దరిపై అతను కోప్పడతాడు. దాంతో నర్మద బాధపడుతుంది. ఇక తనకి చెప్పకుండా చేశారని అత్త వేదవతి నర్మద, ప్రేమలతో మాట్లాడదు.
కాసేపటికి నర్మద, ప్రేమ ఇద్దరు కలిసి వేదవతి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి జరిగింది చెప్తారు. దాంతో తను అర్థం చేసుకుంటుంది. నేను వచ్చిన తరువాత ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందా అని నర్మద ఏడుస్తుంటే.. ఆయనకి కోపం వస్తే అలాగే మాట్లాడతారు.. వాటిని పట్టించుకుని బాధపడతావా అని వేదవతి అంటుంది. అందరి ముందు అలా మాట్లాడితే బాధ ఉండదా అత్తా అని నర్మద అంటే.. అందుకే కదా.. నేను వెళ్లి దులిపేశానని వేదవతి అంటుంది. ఏంటీ మీరు మామయ్య గారిని నిలదీశారా అని నర్మద అడుగుతుంది.. హా.. ఇంటి కోడల్ని పట్టుకుని అంత మాట అంటే అడగకుండా ఎలా ఉంటానూ.. మామూలుగా కాదు.. చాలా గట్టిగానే అడిగాను.. కడిగిపారేశాను. ఆయన కోపంలో అన్నారు తప్ప.. నీపై కోపం ఏం లేదని వేదవతి అంటుంది. అయినా మేం ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలి.. మీరు నాతో చెప్తున్నారా.. అంటే అన్నానని అంటారు కానీ అది గుర్తొచ్చిన ప్రతిసారీ నేను ఎంత ఫీల్ అవుతున్నానోనని వేదవతి అంటుంది. దాంతో ఇంకెప్పుడు అలా చేయమని చెప్తారు.
నేను డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నాననే విషయం మీకు కూడా తెలియదు కదా.. మరి మామయ్యకి ఎలా తెలిసిందని ప్రేమ అడుగుతుంది. అవును కదా.. మరి ఎలా తెలిసి ఉంటుంది సుమీ అని వేదవతి అనగానే నీ ముద్దుల కోడలు వల్లీ చేసిందని నర్మద అంటుంది. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు. తను హ్యాపీగా ఆనందమానందమే అనే పాట పాడుతుంటుంది. దాంతో ఇద్దరు అదే పాటను అందుకుంటారు. వాళ్ళని చూసిన శ్రీవల్లి.. ఎందుకొచ్చారని అడుగుతుంది. ఏం లేదక్కా.. మా మట్టి బుర్రలకు ఓ విషయం తట్టడం లేదు.. నీది పాదరసం బుర్ర కదా.. నేను డాన్స్ క్లాస్‌కి వెళ్లిన విషయం నాకు నర్మదకి తప్ప మూడో వ్యక్తికి తెలియదు.. మరి మామయ్య గారెకి ఎవరు చెప్పారక్కా అని శ్రీవల్లిని ప్రేమ, నర్మద అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |